Home  »  TV News  »  Illu illalu pillalu:  రామరాజుని కుంగదీసిన మోసం.. బయటపడుతుందా శ్రీవల్లి నిజం?

Updated : Aug 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu ).  ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-557లో.. రామరాజు తీవ్ర నిరాశలో ఉంటాడు. తను ఎంతో నమ్మిన సింహాద్రి మోసం చేయడంతో మిల్లులో 5 లక్షలు పోయాయని తెలుసుకుని కుంగిపోతాడు. నమ్మిన వాడే మోసం చేస్తే గుండె తట్టుకోలేదని వేదవతితో చెప్పుకుంటూ ఏడుస్తాడు. ఈ మాట విని ఇంట్లో అందరు షాక్ అవుతారు. అదే సమయంలో శ్రీవల్లి తన తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ ఉంటుంది. మంచి భర్త, మంచి కుటుంబాన్ని మోసం చేశానని, పేదవాళ్లమని ముందే చెప్తే బాగుండేదని తల్లిదండ్రులను తిడుతుంది. నా కాపురం నాశనం అయిపోతుందని చాలా బాధపడుతుంది శ్రీవల్లి.

రామరాజు దగ్గర వల్లి గురించి ప్రేమ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. వల్లి వాళ్ల ఆస్తులు, బిజినెస్ లు అన్నీ అబద్ధమని చెప్పబోతుంది. కానీ నర్మద వెంటనే ప్రేమను ఆపేస్తుంది. ఇప్పుడు చెప్తే గొడవ పెద్దదవుతుందని అడ్డుకుంటుంది. దీంతో నిజం బయటకు రాకుండా ఆగిపోతుంది. వల్లి తన పరువు కాపాడుకోవడానికి భాగ్యం చెప్పినట్లుగా చింతామణికి 6 లక్షలు ఇస్తుంది. అప్పటికే చందు బావ దగ్గర పెళ్లి కోసం 10 లక్షలు తీసుకున్న విషయం కూడా ఇంట్లో తెలియడంతో వల్లి మరింత టెన్షన్ పడుతుంది. ఈ డబ్బు విషయం రామరాజుకి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతుంది.

మరోవైపు విశ్వ తన తెలివితో భద్రవతిని మాటల్లో పెట్టి ఏమారుస్తాడు. వల్లి విషయం బయటకు రాకుండా ఉండటానికి కొత్త ప్లాన్ వేస్తాడు. వల్లిని ఇంట్లో ఉండేలా చేయడానికి విశ్వ, భాగ్యం కలిసి డ్రామా ఆడుతారు. భాగ్యం, ఆనందరావు బస్తీ గెటప్ లో ఇంటికి వస్తారు. వాళ్లను ఆ గెటప్ లో చూసి అందరు షాక్ అవుతారు. ప్రేమ చెప్పాల్సిన నిజం అక్కడితో ఆగిపోతుంది. అసలు వల్లి నిజం బయటపడుతుందా లేదా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Illu illalu pillalu serial, Star Maa serial updates, Srivalli truth, Ramaraju, Telugu TV serial gossip, TeluguOne entertainment






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.